అందాల భామ మెహ్రీన్ కౌర్ యాక్షన్ గాళ్‌గా మారిపోయింది. సోలోగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో నటించేస్తోంది. కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కోసం మెహ్రీన్ యాక్షన్ గాళ్ అవతారమెత్తింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ హీరోయిన్‌గా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమా. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ మెహ్రీన్ కూడా నటిస్తోంది. ఇంతవరకూ గ్లామర్ పాత్రలే పోషించిన మెహ్రీన్‌తో డైరెక్టర్ శ్రీనివాస్ యాక్షన్ చేయించేస్తున్నాడు. అది కూడా టిపికల్ యాక్షన్ సీన్స్‌లో నటిస్తోంది మెహ్రీన్. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఈ సినిమాలో ఇలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటోంది.
తొలిసారి ఇలా యాక్షన్ సీన్స్‌లో నటిస్తున్నాననీ, ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాననీ చెబుతోంది. యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ కనల్ కన్నన్ నేతృత్వంలో ఓ రిస్కీ ఫైట్ సీన్‌లో మెహ్రీన్ నటిస్తోంది.
మరోవైపు మెహ్రీన్ మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో 'అంతరిక్షం' సినిమాలో నటిస్తోంది. రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలివి మెహ్రీన్‌కి. అన్నట్లు చందమామ కాజల్ అగర్వాల్, మిల్కీబ్యూటీ తమన్నా వంటి సీనియర్ హీరోయిన్స్‌తో ఏకకాలంలో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఈ రెండు సినిమాలతోనూ దక్కించుకుంది మెహ్రీన్.