సందీప్‌ కిషన్‌తో నాని హీరోయిన్

మరిన్ని వార్తలు

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' సినిమాతో హీరోగా పాపులరయ్యాడు సందీప్‌ కిషన్‌. ఈ సినిమా సందీప్‌కి మంచి బ్రేక్‌ ఇచ్చింది. కానీ ఆ సక్సెస్‌ని నిలుపుకోవడంలో సందీప్‌ ఫెయిలయ్యాడు. తాజాగా సందీప్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'నక్షత్రం'. ఈ సినిమాలో సందీప్‌కి జోడీగా రెజీనా కసండ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి చాలా చాలా స్పెషాలిటీస్‌ ఉన్నాయి కూడా. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కీలకపాత్ర పోషిస్తుండగా, అందాల భామ ప్రగ్యా జైశ్వాల్‌ కూడా గెస్ట్‌ రోల్‌లో మెప్పిచంనుంది. తెలుగులో సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తోన్న సందీప్‌కి ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. అయితే ఈ ఒక్క సినిమాతోనే కూర్చోకుండా, తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు సందీప్‌ కిషన్‌. గతంలో 'ఏరడీ మహేష్‌' సినిమాలో నటించాడు. ఆ సినిమా తెలుగులో 'మహేష్‌' పేరుతో విడిదలయ్యింది. ఆ తర్వాత చాలా కాలానికి తమిళంలో సందీప్‌ నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో కొత్త సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. తమిళంలో పాపులర్‌ డైరెక్టర్‌ అయిన సుశీంద్రన్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాలో నానికి జోడీగా నటించిన ముద్దుగుమ్మ మెహరీన్‌ కౌర్‌ హీరోయిన్‌. ఒక పక్క 'నక్షత్రం' సినివ రిలీజ్‌కు రెడీ అయ్యింది. మరో పక్క ఈ బైలింగ్వల్‌ మూవీ సెట్స్‌ మీదకు వెళ్లనుంది. సో ఈ ఏడాది సందీప్‌కి అనుకున్న సక్సెస్‌ దక్కాలని కోరుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS