నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా నేను లోకల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారయింది.
వివరాల్లోకి వెళితే, దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న నేను లోకల్ చిత్రం వచ్చే నెల 3వ తారీఖు థియేటర్లలో సందడి చేయబోతుంది. సంక్రాంతి రోజు రిలీజ్ అయిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది అలాగే నానికి తను పలికిన డైలాగ్స్ ట్రెండీగా ఉండటంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
ఈ సంధర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ- `` మా `నేను లోకల్` సినిమా ఫిబ్రవరి 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. మూవీ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. ఈ సక్సెస్‌తో నాని సెకండ్ హ్యాట్రిక్ కొడతాడు. కేరక్టర్ బేస్‌డ్ లవ్‌స్టోరీస్ ఉన్న ఇడియట్, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేరక్టర్ బేస్డ్ లవ్‌స్టోరీతో తెరకెక్కిన చిత్రమిది. యాటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్ అనే క్యాప్షన్ పెట్టాం. ఇటీవల విడుదల చేసిన పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. నెక్స్ట్ ఏంటి? అనే పాట కుర్రకారుకు చాలా బాగా నచ్చింది. లోకల్ గురించిన పాట కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. దేవిశ్రీ ప్రతి పాటకూ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. రచయితలు చక్కగా రాశారు. ఒక్కసారి వినగానే మళ్లీ మళ్లా పాడుకునేలా ఉన్నాయని నాతో చాలా మంది అన్నారు. నాని నేచురల్ పెర్‌ఫార్మర్. ఇందులో ద బెస్ట్‌గా నటించాడు. కీర్తి ఈ సినిమాలో మంచి రోల్ చేసింది.దర్శకుడు త్రినాథరావు చక్కగా తెరకెక్కించారు. నాని యాక్టింగ్, కీర్తి సురేష్ గ్లామర్, టేకింగ్ అన్నీ సినిమాలో హైలైట్ అవుతాయి`` అన్నారు.