'జెంటిల్‌మెన్' సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ నివేదా థామస్ ఇంతవరకూ ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటూ, పర్‌ఫామెన్స్‌కి స్కోపున్న క్యారెక్టర్స్‌నే ఎంచుకుంటూ వస్తోంది. అయితే ఇకపై పర్‌ఫామెన్స్‌తో పాటు, గ్లామర్‌కీ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటోందట. తాజాగా ఈ ముద్దుగుమ్మ 'వి' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పిక్స్‌లో నివేదా డీప్ నెక్‌డ్ పింక్ కలర్ కాస్ట్యూమ్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. అంటే ఈ సినిమాలో నివేదా కాస్త గ్లామర్‌గా కనిపించబోతోందనే సంకేతాలు అందుతున్నాయి. అలాగే ఇకపై కూడా గ్లామర్ చోటున్న పాత్రలను నివేదా ఎంచుకోబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయిందనే చెప్పాలి. 'వి'తో పాటు యంగ్ హీరో నిఖిల్‌తో 'శ్వాస' సినిమాలో నటిస్తోంది నివేదా. అలాగే మరో యంగ్ హీరో శ్రీ విష్ణు సరసన 'బ్రోచేవారెవరురా' సినిమాలోనూ నివేదానే హీరోయిన్. ఇవన్నీ కాక సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'దర్బార్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో నివేదా సూపర్‌స్టార్‌కి కూతురుగా నటిస్తోందనీ సమాచారమ్. ఈ పాత్ర చాలా పోర్ష్‌గా, గ్లామరస్‌గా ఉండబోతోందట. అలాగే తాజా చిత్రం 'వి'లోనూ నివేదా పాత్ర కొత్తగా ఉండబోతోందట. అయితే నాని, సుధీర్‌బాబు.. వీరిద్దరిలో నివేదా ఎవరితో జోడీ కట్టనుందో ప్రస్తుతానికి సస్పెన్సే.