గ్లామరే కాదు, స్టైల్‌ కూడా సూపర్బ్‌

By iQlikMovies - May 03, 2018 - 16:03 PM IST

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో మెహ్రీన్‌ జోరు మామూలుగా లేదు. ఎప్పటికప్పుడే హాట్‌ పిక్స్‌తో తన అందానికి సంబంధించి తాజా ఆప్‌డేట్స్‌ అందిస్తోందీ ముద్దుగుమ్మ. ఇదంతా ఎందుకంటే, కొత్త సినిమాల్లో అవకాశాల కోసమే. ఆల్రెడీ గోపీచంద్‌తో 'పంతం' సినిమాలో నటిస్తున్న ఈ అందాల భామ ఈ మధ్యనే మరో క్రేజీ ఆఫర్‌ కూడా కొట్టేసింది. వరుణ్‌ - వెంకటేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మెగా మల్టీస్టారర్‌ చిత్రంలో మెహ్రీన్‌ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా నటిస్తోంది. ఆమె మరెవరో కాదు, మిల్కీ బ్యూటీ తమన్నా. మిల్కీ బ్యూటీతో మెహరీన్‌ అందచందాల్లో పోటీ అనే చెప్పొచ్చు. అయితే మెహ్రీన్‌తో పోల్చితే, యాక్టింగ్‌లోనూ, అప్పియరెన్స్‌లోనూ తమన్నా చాలా సీనియర్‌. అలాగే వెంకటేష్‌ కూడా సీనియర్‌ హీరోనే. ఇక వరుణ్‌ గురించి చెప్పడానికేముంది మెగా రాకుమారుడు. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌ తన చేతికి చిక్కడంతో చాలా ఆనందంగా ఉందంటోంది మెహరీన్‌. ఇకపోతే ఈ తాజా పిక్‌లో మెహ్రీన్‌ అందంతో పాటు, స్టైల్‌తోనూ ఆకట్టుకుంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS