'భరత్‌' బ్యూటీ తెగ నచ్చేస్తోందిలే.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ 'కైరా అద్వానీ' 'భరత్‌ అనే నేను' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ మూవీకే స్టార్‌ హీరోతో నటించే ఛాన్స్‌ దక్కించుకున్న ఈ అందాల భామ టాలీవుడ్‌కి మోస్ట్‌ క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌ అయిపోయిందిప్పుడు. అంతేనా? వస్తూ వస్తూనే రెండు స్టార్‌ ప్రాజెక్టులు చేజిక్కించుకోవడంతో అమ్మడి క్రేజ్‌ అలా ఇలా లేదు. 

లేటెస్టుగా ఓ మొబైల్‌ షాప్‌ ఓపెనింగ్‌కి విచ్చేసిన ఈ బ్యూటీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అభిమానులతో ఆప్యాయంగా మమేకమై, వారితో సెల్ఫీలు దిగుతూ కైరా అద్వానీ భలే సందడి చేసింది. ఆ ఆటిట్యూడ్‌ అభిమానులకు తెగ నచ్చేసింది. దాంతో కైరాపై విపరీతమైన అభిమానం పెంచేసుకుంటున్నారు అభిమానులు. కేవలం కైరా కోసమే మరోసారి 'భరత్‌ అనే నేను' సినిమా చూసేందుకు ఫ్యాన్స్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారంటే, అమ్మడి ఎఫెక్ట్‌ ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

తొలి సినిమా సక్సెస్‌తో ఉత్సాహంగా ఉన్న కైరా అద్వానీ నెక్స్ట్‌ సినిమా మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బోయపాటి సినిమాల్లో హీరోయిన్లు కొంచెం, మాస్‌ కొంచెం క్లాస్‌ లుక్‌తో కనిపిస్తారు. 'భరత్‌'లో కైరా డీసెంట్‌ అండ్‌ క్లాస్‌ లుక్‌లో కనిపించింది. ఈ సినిమా కోసం మాస్‌ అప్పీల్‌కి రెడీ అవుతోంది. ఇక మాస్‌ లుక్‌లో కనిపిస్తే, అభిమానులకు కిర్రాక్‌ షోనే కదా. చరణ్‌తో సినిమా అంటే హీరోయిన్‌ డాన్సులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ముందుగానే డాన్సుల్లో శిక్షణ పొందుతోందట అందాల కైరా అద్వానీ.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS