కామెడీనా.. సారీ బాస్‌ అంటోన్న మెహ్రీన్‌!

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ మెహ్రీన్‌ ఈ సంక్రాంతికి 'ఎంత మంచి వాడవురా' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సినిమాతో మెహ్రీన్‌కి పెద్దగా వచ్చిన గుర్తింపు ఏమీ లేకపోయినా, ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించాననే సంతృప్తి మిగిలిందట. అలాగే తమిళంలో ధనుష్‌ సరసన 'పటాస్‌' మూవీలో నటించింది. మంచి హిట్‌ కొట్టింది. ఇక ఇప్పుడు 'అశ్వద్థామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగశౌర్య - మెహ్రీన్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్‌ కానుంది. 'ఇదో సీరియస్‌ థ్రిల్లర్‌ మూవీ.

 

ఈ సినిమాలో కామెడీ ఆశిస్తే.. సారీ..' అని ముందే చెప్పేసింది మెహ్రీన్‌. ఇంతవరకూ బబ్లీగా, గ్లామరస్‌గా కనిపించిన మెహ్రీన్‌ ఈ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తోందట. పాత్ర మొదట్లో కాస్త బబ్లీగా ఉన్నా, ఆ తర్వాత, హీరోకి దిశా నిర్దేశం చేసే హీరోయిన్‌గా పరిణీతి చెందుతుందట. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లో ఆసక్తి కనిపిస్తుంది. రియలిస్టిక్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా చేసుకుని, నాగశౌర్య సిద్ధం చేసిన స్క్రిప్టు ఇది. రమణ తేజ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. వయసుతో సంబంధం లేకుండా, మహిళలపై జరుగుతున్న అకృత్యాలను బేస్‌ చేసుకుని ఈ సినిమా కథ రెడీ చేశారు. తెలిసిన విషయాలే అయినా, వాటిని తెరపై ఆవిష్కరించిన విధానం ప్రతిక్షణం ఉత్కంఠ కలిగిస్తుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. నాగశౌర్య హోమ్‌ బ్యానర్‌ అయిన ఐరా క్రియేషన్స్‌లో ఈ సినిమా రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS