ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వి' నుండి లేటెస్ట్‌గా నాని లుక్ రిలీజ్ చేశారు. చేతిలో సిజర్, ఆ సిజర్ నుండి కారుతున్న బ్లడ్, తలపై చేయి పెట్టి, తీక్షణంగా ఏదో ప్లాన్ చేస్తున్నట్లు సీరియస్‌గా కనిపిస్తున్నాడు నాని. ఈ సినిమాలో నాని విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 'రాక్షసుడు'గా నానిని అభివర్ణిస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ సినిమాలో నాని లుక్స్ ఉన్నాయి. గుబురు గెడ్డం, మీసాలతో సమ్‌థింగ్ డిఫరెంట్ లుక్స్‌లో నాని కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో సుధీర్‌బాబు. 'రక్షకుడు' అంటూ సుధీర్‌బాబు లుక్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు.
రక్షకుడి చేతిలో గన్ పెడితే, రాక్షసుడి చేతిలో బ్లడ్‌తో నిండిన సిజర్ పెట్టారు. లుక్స్ అయితే, ఆసక్తికరంగానే ఉన్నాయి. సినిమా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాని ఎంత కాలం నుండో ఎదురు చూస్తున్న రోల్ ఇది. పూర్తి స్థాయి నెగిటివ్ రోల్‌లో కనిపించాలన్న నాని కోరిక ఈ సినిమాతో తీరనుందా.? అంటే సినిమా విడుదల వరకూ వెయిట్ చేయాల్సిందే. మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.