వెండితెరపై అవకాశాలెంతలా ఉన్నా, స్టార్డమ్తో సంబంధం లేకుండానే డిజిటల్ స్క్రీన్‌పై మోజు పడుతున్న రోజులివి. స్టార్ హీరోలూ, స్టార్ హీరోయిన్లతో ఇప్పటికే డిజిటల్ ప్లాట్ఫామ్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువయిపోయింది. ఇక తాజాగా ముద్దుగుమ్మ మెహ్రీన్ కూడా డిజిటల్ స్క్రీన్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఓ హిందీ వెబ్ సిరీస్‌కి సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ మెహ్రీన్‌ని సంప్రదించిందట. ప్రస్తుతం చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేమీ లేకపోవడంతో, వచ్చిన సదవకాశాన్ని ఎందుకు వదుకోవాలని.. మెహ్రీన్ వెంటనే ఓకే చెప్పేసిందట. త్వరలోనే ఈ వెబ్‌సిరీస్ రూపొందనుందనీ తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది మెహ్రీన్ ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించింది. తెలుగులో ‘ఎంత మంచి వాడవురా’, ‘అశ్వథ్ధామ’ చిత్రాలతో ఆకట్టుకున్న మెహ్రీన్, తమిళంలో ధనుష్ సరసన ‘పటాస్’ సినిమాలో నటించింది. ఈ సినిమాని ‘గల్లీ బోయ్’ పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కానీ, తెలుగులో ఓకే అనిపించుకుంది ఈ సినిమా. ప్రస్తుతం మరికొన్ని కొత్త ప్రాజెక్టులు ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్న మెహ్రీన్, ఇటు వెండితెరనూ, అటు డిజిటల్ తెరనూ ఎట్ ఏ టైమ్ మ్యానేజ్ చేయానుకుంటోందట. చూడాలి మరి.