మెగాస్టార్‌తో రెజీనా.. ఐటెమ్‌ కాదట సెలబ్రేషనట.!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవితో ముద్దుగుమ్మ రెజీనా ఐటెం సాంగ్‌లో నటిస్తోందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అప్పట్లో ఇది గాసిప్‌ అనుకున్నారంతా. కానీ, నిజమే అని రెజీనా మాటల్లో కన్‌ఫామ్‌ అయిపోయింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రెజీనా, మెగాస్టార్‌తో సాంగ్‌ గురించి రెస్పాండ్‌ అయ్యింది. ఇంతవరకూ తాను స్పెషల్‌ సాంగ్స్‌లో నటించలేదనీ, అయినా డాన్స్‌ అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి.. అందులోనూ మెగాస్టార్‌తో కలిసి డాన్స్‌ చేసే అదృష్టం మళ్లీ మళ్లీ రాదు కాబట్టి, ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌కి ఒప్పుకున్నాననీ చెప్పింది. రీసెంట్‌గా ఈ సాంగ్‌ షూటింగ్‌ జరిగిందట.

 

ఈ సాంగ్‌లో మెగాస్టార్‌తో కలిసి రెజీనా రెచ్చిపోయి డాన్సులేసిందట. ఆమె డాన్సుకు మెగాస్టార్‌ ఫిదా అయిపోయారట. చాలా బాగా డాన్స్‌ చేస్తున్నావ్‌ అని రెజీనాని ప్రశంసించారట. కొరటా శివ ` చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ మూవీలోని స్పెషల్‌ సాంగ్‌ ముచ్చట ఇది. అయితే, దీన్ని ఐటెమ్‌ సాంగ్‌ అని పొరపాటున కూడా అనొద్దనీ, సెలబ్రేషన్‌ సాంగ్‌ అనాలనీ కోరుతోంది రెజీనా. అన్నట్లు ఈ ముద్దుగుమ్మకి ఇదే తొలి స్పెషల్‌ సాంగ్‌. ఇకపై స్పెషల్‌ సాంగ్స్‌లో నటించనని కూడా చెప్పేస్తోంది. ఇదిలా ఉంటే, గతంలో చిరంజీవి సాంగ్‌ ‘గువ్వా.. గోరింకవో..’ రీమిక్స్‌ సాంగ్‌కి మెగా మేన్లుడు సాయిధరమ్‌ తేజ్‌తో రెజీనా చిందేసిన సంగతి తెలిసిందే. ఇక రెజీనా ప్రజెంట్‌ ‘నేనేనా.?’ అనే ఓ సస్పెన్స్‌ థ్ల్రిల్లర్‌ మూవీలో శూర్పణఖగా లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS