అందాల భామ మెహరీన్ లేటెస్టుగా 'పంతం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మధ్య మెహరీన్ సన్నబడ్డానంటూ స్లిమ్‌గా ఉన్న తన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ సంబరపడిపోయింది. అయితే అలా సన్నబడ్డానని చెప్పాక మెహ్రీన్ కనిపించింది 'పంతం' సినిమాలోనే. అయితే సినిమా చూసిని వాళ్లు మెహ్రీన్‌పై కామెంట్లు గుప్పిస్తున్నారు.
ఏం సన్నబడ్డావమా.! ఇంకా చాలా సన్నబడాలమ్మా అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. తన బాడీకి అన్ని రకాల మోడ్రన్ అండ్ హాట్ కాస్ట్యూమ్స్ సరిపడవనీ తెలిసిపోతోంది. మరి ఎందుకు మెహ్రీన్ ఇలా చేస్తోంది. కాస్త ఫిట్‌నెస్‌పై దృష్టి పెడితే బావుంటుంది. 'పంతం' తర్వాత అమ్మడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్'లో నటిస్తోంది. ఈ సినిమాలో మెహ్రీన్‌తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది. ఫిజిక్‌లో తమన్నాని కొట్టేవారే లేరు. అలాంటప్పుడు తమన్నా పక్కన మెహ్రీన్ తేలిపోతుందా? అందుకే అలా కాకుండా ఉండాలంటే ఇంకాస్త బరువు తగ్గించాల్సి ఉంది మెహ్రీన్.
ఇదిలా ఉంటే, తొలి సినిమా తప్ప మెహ్రీన్‌కు చెప్పుకోదగ్గ విజయాలు లేవు. వరుస పెట్టి సినిమాల్లో నటించేస్తోంది కానీ, ఏ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదీ ముద్దుగుమ్మకి. అయితే మరి వరుణ్ అయినా మెహ్రీన్‌ని కాపాడతాడో లేదో చూడాలి మరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వెంకటేష్ ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌కి తోడళ్లుడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.