తెలుగు చిత్రసీమలో గోల్డెన్ లెగ్ ట్యాగ్ అందుకున్న మెహ్రీన్ ఈ మధ్యనే సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ తో జతకట్టి మెగా హీరోయిన్ అయింది. ఇక ఇప్పుడు మరొక మెగా హీరోతో నటించే అవకాశం దక్కించుకుంది.
వివరాల్లోకి వెళితే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకి-వరుణ్ తేజ్ లు నటిస్తున్న F2 చిత్రంలో మెహ్రీన్ కి అవకాశం దొరికినట్టు సమాచారం. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా ఈ పంజాబీ సుందరి కనువిందు చేయనుంది. ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇవన్ని అటుంచితే ప్రస్తుతం, మెహ్రీన్ సక్సెస్ గ్రాఫ్ బాగుండడంతో సినిమా అవకాశాలకి కొదవ లేదు అన్న టాక్ వినపడుతుంది. ఇప్పుడిక మెగాహీరో తో నటించే అవకాశం రావడంతో ఆమె రేంజ్ మరింత పెరిగింది అని చెప్పొచ్చు.
మొత్తానికి కెరీర్ తొలి రోజుల్లోనే ఇటువంటి మల్టీ స్టారర్ చిత్రంలో అవకాశం రావడం నిజంగా అదృష్టమే.