పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాని ఫ్రెంచ్ సినిమా అయిన The Heir Apparent- Largo Winch ఫ్రీ మేక్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో ఆ చిత్రంలోని ఒక సన్నివేశం తాలుకా స్క్రీన్ షాట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
అదేమనగా మనకి టీజర్ లో నటి ఖుష్బు ఒక మీటింగ్ ని ప్రీసైడ్ చేసే సన్నివేశంలాగానే అచ్చం ఆ ఫ్రెంచ్ సినిమాలో కూడా ఒక సన్నివేశం ఉండడం ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం జరుగుతున్నది. అసలే ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ సినిమాల పైన కాపీరైట్ కామెంట్స్ వస్తుండం, ఆయన గత చిత్రం అ.. ఆ.. పైన కూడా ఇటువంటివే రావడం మనం చూశాము.
ఈ పరిస్థితిలో ఆయన నుండి ఇటు పవన్ ఫ్యాన్స్ అటు ఆయన అభిమానులు ఒక క్లారిటీ ని కోరుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరోక వార్త కూడా రానా మధ్యవర్తిత్వం చేసినందువల్లె ఈ సినిమా విడుదల అవుతున్నది అని కూడా ప్రచారంలో ఉంది.
ఏదేమైనా ఇటువంటి కాపీరైట్ కలకలం సినిమా విడుదలకి ఒక వారం ఉంది అనగా రావడం చాలా ఇబ్బందిగా మారింది. మరి ముఖ్యంగా పవన్ అభిమానులకి ఇది మరింత టెన్షన్ ని పెంచుతున్నది.