ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి చిత్రాలలో మెంటల్ మదిలో చిత్రం ఒకటి. కథాపరంగా చాలా సింపుల్ గా ఉన్నా కథనం పరంగా చాలా బాగా తీశాడు అన్న పేరు యువ దర్శకుడు అయిన వివేక్ ఆత్రేయకి లభించింది.
ఇక ఇప్పుడు మెంటల్ మదిలో చిత్రాన్ని నిర్మించిన మరియు సమర్పించిన రాజ్ కందుకూరి & సురేష్ బాబు మళ్ళీ ఇదే దర్శకుడు వివేక్ తో ఒక చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఆ చిత్రానికి- బ్రోచెవారెవరు! అన్న ఆసక్తికర టైటిల్ ని కూడా పెట్టేశారు.
దీనికి సంబందించిన ప్రకటన కూడా కొద్దిసేపటి క్రితమే వెలువడింది. అయితే ఈ సినిమాలో హీరో-హీరోయిన్ ఎవరు అనేదాని పైన ఇంకా స్పష్టతలేదు. త్వరలోనే దీనికి సంబందించిన పూర్తీ వివరాలు తెలుస్తాయి.
మరో మెంటల్ మదిలో అయితే గ్యారంటీ అని అంటున్నారు ఈ ప్రకటన చూసిన ప్రేక్షకులు...