పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో మొదటి అడ్డంకి ఎదురైనట్టుగా తెలుస్తున్నది.
అదేమనగా ఆయన పార్టీ కార్యాలయానికి సంబంధించి గుంటూరు జిల్లాలో ఒక స్థలాన్ని ఎంపిక చేయడం, దానిని ఆయన స్వయంగా వెళ్ళి మొన్న పరిశీలించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆ స్థలం మాది అంటూ కొందరు మీడియా ముందుకి రావడం చర్చనీయంశంగా మారింది.
గతంలో జనసేన పార్టీ కార్యాలయం నిమిత్తం ఈ స్థలాన్ని మూడు సంవత్సరాలకి సుబ్బారావు అనే వ్యక్తి దగ్గర లీజుకి ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు వేరే వారు రావడంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఇక వెంటనే ఈ విషయమై పవన్ కళ్యాణ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఆ ప్రకటన సారాంశమేంటంటే- జనసేన కార్యాలయం భూమి వివాదం గురించి తనని వ్యక్తిగతంగా సంప్రదించాల్సి ఉంటె బాగుండేది అని, లేదా మొన్న తాను స్థలాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు గాని తెలియచేస్తే వెంటనే తగు చర్యలు తీసుకునేవాడిని అని తెలిపారు. ఇప్పుడు ఇలా చేయడంతో తనకి ఇదొక కుట్రలా అనిపిస్తుంది అని చెప్పారు.
అయితే ఈ స్థలానికి వెంటనే తన కార్యకర్తలని, న్యాయ నిపుణులని పంపుతానని, అసలు హక్కుదారులు తమ పత్రాలని చూపితే వెంటనే ఆ లీజుని రద్దు చేస్తానని ప్రకటిస్తున్నాను.
మొత్తం వ్యవహారం చూస్తే, పవన్ కళ్యాణ్ కి రాజకీయ ఇబ్బందులు మొదలయ్యయా అన్న భావన ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతున్నది.