సందీప్ కిషన్ నటించిన మైఖేల్.. శుక్రవారం విడుదలైంది. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలున్నాయి. టైటిల్ క్యాచీగా ఉండడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రచారం కూడా భారీగా చేశారు. సందీప్ పై ఇంత పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేశారు. అయితే తొలి షో పడగానే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. కథలో కొత్తదనం లేదని, కేజీఎఫ్, అంతం, పంజా సినిమాల్ని కలిపి చూసినట్టు ఉందని విశ్లేషకులు పెదవి విరిచారు.
అయితే... ప్రీ రిలీజ్ హైప్ తో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్సే వచ్చాయి. సందీప్ కెరీర్‌లో ఇవే బెస్ట్ నెంబర్స్ అని టాక్. పైగా.. భారీగా థియేటర్లు ఇచ్చారు. దాంతో కలక్షన్ల పరంగా తొలిరోజు ఓకే అనిపించుకొంది. కానీ ఇది సరిపోదు. ఈ సినిమాని అత్యధిక రేట్లకు అమ్మారు. ఇదంతా తిరిగి రావాలంటే.. తొలి మూడు రోజులూ భారీ వసూళ్లు అందాలి. కానీ అది దాదాపుగా అసాధ్యం. ఫ్లాప్ టాక్ రావడంతో.. రెండో రోజు నుంచే థియేటర్ల దగ్గర సందడి తగ్గిపోయింది. సో... ఈ సినిమాని భారీ రేట్లకు కొన్నవాళ్లంతా ఇప్పుడు ఆందోళనలో పడిపోయారు.