లైగ‌ర్ కోసం మైక్ టైస‌న్ కి రంగంలోకి దింపుతున్నాడా?

By Gowthami - June 17, 2021 - 13:29 PM IST

మరిన్ని వార్తలు

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా... `లైగ‌ర్‌`. తెలుగు నుంచి త‌యార‌వుతున్న మ‌రో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. బాక్సింగ్ నేప‌థ్యంలో న‌డిచే క‌థ ఇది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ ప్రొఫెష‌న‌ల్ బాక్స‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా కోసం పూరి జ‌గ‌న్నాథ్‌.. ఓ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిని రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నాడ‌ట‌. అత‌నెవ‌రో కాదు.. బాక్సింగ్ లెజెండ్ - మైక్ టైస‌న్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా.. బాక్సింగ్ కి గుర్తింపు తీసుకొచ్చి, ఈ రంగంలో అద్వితీయ‌మైన విజ‌యాలు అందుకున్నాడు మైక్ టైస‌న్‌.

 

`లైగ‌ర్‌` బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే సినిమా కాబ‌ట్టి, మైక్ టైస‌న్ కి ఓ ప్ర‌త్యేక‌మైన పాత్ర కోసం ఎంచుకుంటే ఎలా ఉంటుంద‌న్న‌ది పూరి ఆలోచ‌న‌. అందుకు మైక్ టైస‌న్ తోనూ.. పూరి సంప్ర‌దింపులు మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. మైక్ ఓకే అంటే... `లైగ‌ర్`లో మ‌రో కొత్త ఆక‌ర్ష‌ణ వ‌చ్చి చేరిన‌ట్టే. అప్పుడు... పాన్ ఇండియా ఏమిటి? ఈ సినిమాని పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగానూ మార్చేయొచ్చు.ఎందుకంటే.. టైస‌న్ కి విశ్వ‌వ్యాప్తంగా అంత‌మంది అభిమానులున్నారు మ‌రి.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS