2012, 2013 సంవత్సరాలకు నంది అవార్డుల్ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జయసుధ, కోడి రామకృష్ణ వేర్వేరుగా ఆయా సంవత్సరాలకుగాను నంది అవార్డుల కమిటీలకు ఛైర్మన్లుగా వ్యవహరించారు. అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుని, అవార్డు విజేతల్ని ఎంపిక చేశారట. రాజమౌళి 'ఈగ', కొరటాల శివ 'మిర్చి' అవార్డులు దక్కించుకున్నాయి. 'ఈగ' బాలీవుడ్‌కి మన తెలుగు సినిమా సత్తా చూపిస్తే, 'మిర్చి' ప్రభాస్‌కి విపరీతమైన స్టార్‌డమ్‌ని తెచ్చింది. 'అత్తారింటికి దారేది' చిత్రానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో నంది అవార్డులు అయోమయంలో పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో సింహా అవార్డులు అందజేస్తామని ఇటీవలే ప్రకటించింది. ఏదేమైనా, 'ఈగ' సినిమా విడుదలైన ఐదేళ్ళ తర్వాత ఆ సినిమాకి నంది అవార్డు రావడం అభినందనీయం. అలాగే 'మిర్చి' సినిమాకి కూడా నాలుగేళ్ళ తర్వాత పురస్కారం లభించింది. వివిధ కేటగిరీల్లో 'ఈగ' సినిమాకి అవార్డులు దక్కాయి. ఉత్తమ కథానాయకురాలుగా ముద్దుగుమ్మ సమంతకు అవార్డును ప్రకటించారు. 'ఏ మాయ చేశావె' చిత్రానికి ఆమెకు అవార్డు దక్కింది. అలాగే బెస్ట్ పాపులర్ ఎంటర్‌టైనర్‌గా అల్లు అర్జున్ నటించిన 'జులాయి' సినిమాకి అవార్డు దక్కింది.