బాలయ్య బాబు కనపడుటలేదట!

మరిన్ని వార్తలు

హెడ్డింగ్ చదివి కంగారుపడకండి. ఇది మేము చెప్తున్న మాట కాదు, హీరో బాలకృష్ణ ఎమ్యెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన ఫిర్యాదు సారాంశం.

వివరాల్లోకి వెళితే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది బాలకృష్ణ నియోజకవర్గానికి సమయం కేటాయించట్లేదని, ప్రజల సమస్యల పై దృష్టి పెట్టడం లేదని, కేవలం సినిమాల పైనే దృష్టి నిలుపుతున్నారని వారు పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.

దీనికి టీడీపీ సభ్యులు కూడా కౌంటర్ ఇవ్వడంతో హిందూపూర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందట! ప్రస్తుతం బాలయ్య తన 101వ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.

మరి తన పై నమోదైన ఈ ఫిర్యాదు పై అతను ఎలా స్పందిస్తాడో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS