పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా ఇంకొక మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇక పవన్ సినిమాలకి ఓపెనింగ్స్ ఎంత భారీగా ఉంటాయో తెలియంది కాదు.
ఇక విషయానికి వస్తే, వరుణ్ తేజ్ తన కొత్త సినిమా మిస్టర్ ట్రైలర్ ని కాటమరాయుడు రిలీజ్ అయిన ధియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇలా రిలీజ్ చేస్తే, సినిమాకి తప్పకుండా మంచి పబ్లిసిటీ వస్తుందని అని మిస్టర్ నిర్మాతల వ్యూహం. అయితే ట్రైలర్ లాంచ్ మాత్రం రేపు యు ట్యూబ్ ద్వారా విడుదల చేయనున్నారు.
ఆల్రెడీ నిన్ననే ఏదో ఏదో అనే పాటని రిలీజ్ చేశారు, దానికి మిక్కి జే మేయర్ అందించిన ట్యూన్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది.
మొత్తానికి ఈ అబ్బాయి తన బాబాయ్ ఇమేజ్ ని బాగానే వాడుకోబోతున్నట్టుగా అనిపిస్తుంది.