సినీయర్ హీరో మోహన్ బాబు మూడు దశాబ్దాలుగా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు నడుపుతున్న సంగతి తెలిసిందే. మొదట శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరో అడుగుముందుకు వేశారు. 'మోహన్ బాబు యూనివర్సిటీ'' అందుబాటులోకి తెచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా అయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
''చిన్న విత్తనంగా ప్రారంభమైన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు నేడు కల్పవృక్షంగా మారాయి. మూడు దశాబ్దాలుగా మీరు నాపై వుంచి విశ్వాసం, నా జీవిత లక్ష్యం.. ఇప్పుడు యూనివర్సిటీ విద్యాలోకి చేరుకున్నాయి. తిరుపతిలో 'మోహన్ బాబు యూనివర్సిటీ' ఏర్పాటైయింది. మీ ప్రేమే నా బలం.. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను'' అంటూ ట్వీట్ చేశారు మోహన్ బాబు.