ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటి అయ్యారు. ఈ భేటిపై పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై ప్రధానంగా వీరి భేటి జరిగింది . టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని గత కొన్ని రోజులు సినీ పరిశ్రమ వర్గాలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రభుత్వంతో చర్చించారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ భేటి మాత్రం ఇండస్ట్రీ పెద్ద దిక్కు కోణం చూస్తున్నాయి సినీ వర్గాలు.
నిజానికి ఇటివలే చిరంజీవి తనకు ఇండస్ట్రీ పెద్ద పోస్ట్ తీసుకునే ఆలోచన లేదని, సమస్య వస్తే మాత్రం భాద్యతగా ముందుకు వస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచే చిరుకు కబురు అందింది. ఈ భేటి పై ఇండస్ట్రీ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. కొన్నాళ్ళు సినిమా రంగంలో నెలకొన్న సమస్యలు ఈ భేతోతో ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. ఇదివరకూ చాలా మంది సినీ ప్రముఖులు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ చిరు భేటిని పెద్ద దిక్కు తరహాలోనే చూస్తున్నారు. 'ఇండస్ట్రీ పెద్ద' పోస్ట్ పై చిరుకి అంత ఆసక్తిలేకపోయినా 'పెద్ద' తరహాలోనే ఇప్పుడు ప్రభుత్వంలో భేటి అవుతున్నారు చిరు. మరి ఈ భేటితోనైనా పరిశ్రమ సమస్యలు ఓ కొలిక్కివస్తాయో లేదో చూడాలి.