తమిళ దర్శకుడు మోహన్ రాజా ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. `లూసీఫర్`కి ఇది రీమేక్. `గాడ్ ఫాదర్` పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
మరోవైపు.. మోహన్ రాజా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. నాగార్జున కోసం ఓ కథ రెడీ చేశారని, నాగ్ తో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పుడు మోహన్ రాజా తన నిర్ణయాన్ని మార్చుకొన్నార్ట. నాగ్ తో కాకుండా.. అఖిల్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం అందింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో `ఏజెంట్` సినిమా రూపొందుతోంది. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సెప్టెంబరు, అక్టోబరులో మోహన్ రాజా సినిమా సెట్స్‌పైకి వెళ్లొచ్చు. ఈలోగా.. `గాడ్ ఫాదర్` పనులు కూడా పూర్తవుతాయి. ఏజెంట్ షూటింగ్ ప్రస్తుతం మనాలీలో జరుగుతోంది. మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.