ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఊపిర్తిత్తులు, కిడ్నీ సంబంధిత ఇన్‌ఫెక్షన్స్‌తో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చాలా కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం శ్వాస అందక తీవ్రంగా బాధపడుతోన్న సందర్భంలో ఆయన్ని కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. డయాలసిస్ కూడా చేసినట్లు వైద్యులు తెలిపారు. ఒక చిన్న సర్జరీ చేయాలని, సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యం విషయమై వైద్యులు స్పెషల్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సంగతి తెలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ అంతా విషాదంలో మునిగిపోయింది. జయసుధ, మోహన్‌బాబు, అల్లు అరవింద్ పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రిలో ఆయన్ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. దాదాపు 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు డైరెక్టర్ ఆయన. ఆయన అనారోగ్య పరిస్థితిని తెలుసుకుని టాలీవుడ్‌లోని పలువురు సినీ ప్రముఖులు ఆయన్ని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా, రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు దాసరి. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అయిన దాసరి నారాయణరావు తొందరగా కోలుకోవాలని అంతా ఆశిస్తున్నారు.