జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్ - మోహన్‌లాల్ ల ద్వయం... వెండి తెరపై సందడి చేసింది. వీరిద్దరి కెమిస్ట్రీ, ఆ పాత్రల్ని తెరకెక్కించిన తీరు ఆకట్టుకొన్నాయి. మోహన్ లాల్ రాక.. ఆ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు మరోసారి... ఎన్టీఆర్ కోసం మోహన్ లాల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా త్వరలోనే రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర ఒకటుంది. ఆ పాత్రలో స్టార్ కనిపిస్తేనే బాగుంటుందన్నది ప్రశాంత్ నీల్ ఆలోచన. అందుకే మోహన్ లాల్ ని సంప్రదించినట్టు టాక్. ఈపాత్ర కోసం ముందుగా కమల్ హాసన్‌ని ఎంచుకోవాలని చూశార్ట.
అయితే కమల్ పెద్దగా స్పందించకపోవడంతో... ఇప్పుడు మోహన్ లాల్ వెంట పడుతున్నట్టు సమాచారం. కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ తీసిన ప్రశాంత్ అంటే అందరికీ గౌరవమే. తను కథ చెబితే ఎవరైనా ఒప్పుకుంటారు. మోహన్ లాల్ కూడా పచ్చ జెండా ఊపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కాంబో సెట్టయితే... మరోసారి థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం. త్వరలోనే కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. అది పూర్తవ్వగానే ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుంది.