సలార్ 2 లో మరో మలయాళ స్టార్

మరిన్ని వార్తలు

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ వలన, భాషల ఎల్లలు, ప్రాంతీయ భేదాలు చెరిగిపోయి అన్ని ఇండస్ట్రీల వాళ్ళు కలిసి పని చేసుకుంటున్నారు. సొంత భాషలో ఎంతటి స్టార్ అయినా వేరే భాషలో చిన్న పాత్ర వచ్చినా నటించటానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా సౌత్ లో ఈ మార్పు బాగా కనిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్య తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. జనతా గ్యారేజ్, మనమంతా లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. మోహన్‌ లాల్‌ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప లో నటిస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కూడా నటించనున్నారని సమాచారం. 


సలార్ పార్ట్ 1 లో స్టార్ కాస్టింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సలార్ లో మలయాళ ఇండస్ట్రీ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. కోలీవుడ్ నుంచి బాబీ సింహ, శ్రేయా రెడ్డి, శృతిహాసన్ లాంటి వారున్నారు. ఇప్పడు మోహన్ లాల్ కూడా సలార్ 2 లో నటిస్తున్నట్లు టాక్. సలార్ మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పార్ట్ 2 ఎపుడు వస్తుంది అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో 'డ్రాగన్' తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రభాస్ కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఇవి కంప్లీట్ అయ్యాక సలార్ 2 ఉండొచ్చని సమాచారం. 


మొదటి పార్ట్ కి మించి సెకండ్ పార్ట్ ఉంటుందని కొత్తగా కొందర్ని యాడ్ చేసే ఉద్దేశ్యంతోనే మోహన్ లాల్ ని  ప్రశాంత్ నీల్ సంప్రదించినట్లు తెలుస్తోంది. పార్ట్ 1లో చాలా విషయాలు  సస్పెన్స్ గా ఉంచారు. అవి పార్ట్‌ 2 లో రివీల్ చేస్తారని ఆసక్తిగా ఉన్నారు ఫాన్స్. సలార్‌ 2 కి సంబంధించిన వర్క్ మొదలైంది. రీసెంట్ గా ఒక పాడ్ కాస్ట్ లో సలార్ చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ 2025 లో సలార్‌ 2 రిలీజ్ అని ప్రకటించాడు. 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్' స్థాయిలో సలార్‌ 2 ఉంటుందని స్పష్టం చేసారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS