సందీప్ కోలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ

మరిన్ని వార్తలు

తెలుగు హీరో సందీప్ కిషన్ కి టాలీవుడ్ లో ఈ మధ్య సరైన హిట్ లభించలేదు. కానీ కోలీవుడ్ లో 'రాయన్' మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. దీనితో కోలీవుడ్ లో మరిన్ని అవకాశాలతో  బిజీ అవుతున్నాడు. ఇంతక ముందు 'కెప్టెన్ మిల్లర్' లో ధనుష్ తో కలిసి నటించాడు. రీసెంట్ గా ధనుష్ 'రాయన్' మూవీలో సందీప్ కీలక పాత్రలో నటించి తన నటనతో, తమిళ తంబీలకు మరింత చేరువ అయ్యాడు. ఇప్పడు మరొకసారి కోలీవుడ్ లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో నటించ నున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్  మెంట్ వచ్చింది.  కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి కొడుకు ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. 


జనరల్ గా హీరోల కొడుకులు హీరోలుగానే ఎంట్రీ ఇస్తారు. హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టడంతో అతని కొడుకు హీరోగా సినీ వారసత్వం కొనసాగిస్తాడనుకుంటే జాస‌న్ సంజ‌య్‌ మాత్రం డైరెక్ట‌ర్‌గా మారుతున్నాడు. లండ‌న్‌లో స్క్రీన్ రైటింగ్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తిచేసి, కెన‌డాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు సంజయ్. విజ‌య్ హీరోగా న‌టించిన వెట్టైకార‌న్ సినిమాలో 'సంజ‌య్' ఓ పాటలో కనిపించాడు. హీరోగా ఎన్ని ఆఫర్స్ వచ్చినా మెగా ఫోన్ పట్టేందుకే ఆసక్తి చూపాడు. ఏమో  భ‌విష్య‌త్తులో హీరోగా మారుతాడేమో కానీ ప్రస్తుతం దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు. 


ఈ క్రమంలోనే తన డెబ్యూ ప్రాజెక్ట్ కోసం సందీప్ కిషన్ ని ఎంచుకున్నాడు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్ తెరకెక్కిస్తోంది.  తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. యూత్ ని టార్గెట్ చేసుకుని 'ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌'గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. మొదట ఈ మూవీలో చియాన్  విక్రమ్  కొడుకు ధృవ్ హీరో గా నటిస్తాడని వార్తలు వచ్చాయి కానీ సందీప్ కిషన్ కి తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్ లో  మంచి ఫాలోయింగ్ ఉండటంతో సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించనున్నారు. త్వ‌ర‌లోనే మిగతా డిటైల్స్ తెలియనున్నట్లు సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS