మోక్షజ్న సిక్స్‌ ప్యాక్‌ చెయ్యడా?

మరిన్ని వార్తలు

ఈ ఏడాది చివర్లో తన కుమారుడు మోక్షజ్నను హీరోగా పరిచయం చేస్తామని బాలకృష్ణ చెప్పారు. సొంత నిర్మాణ సంస్థని కూడా ప్రారంభిస్తానంటున్నారాయన. బహుశా తన కుమారుడి సినిమాని తన నిర్మాణంలోనే బాలకృష్ణ చేస్తారేమో. అలాగే దర్వకత్వ ఆలోచనలు కూడా తనకున్నట్లు బయటపెట్టారు బాలకృష్ణ. నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఆయనకి 'శాతకర్ణి' ఎంతో తృప్తినిచ్చిందన్నారు. అంతేకాదు తన తండ్రి ఎన్టీఆర్‌ చివరి కోరికను నేను ఈ సినిమా ద్వారా ఇన్నాళ్లకి తీర్చగలిగాను అని కూడా ఆయన ఆభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం యువతరం ఇంట్రెస్ట్‌ చూపిస్తోన్న సిక్స్‌ ప్యాక్‌ అదే ఆరు పలకల బాడీ గురించి ఆయన ఓ కామెంట్‌ చేశారు. సిక్స్‌ ప్యాక్‌ మన సంప్రదాయం కాదని బాలకృష్ణ స్పష్టం చేశారు. అయితే ఈ సిక్స్‌ ప్యాక్‌ ఇప్పుడు సినీ రంగంలో ట్రెండింగ్‌ అయ్యింది. దాదాపు హీరోలంతా సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేసేస్తున్నవారే. అయితే బాలకృష్ణ మాత్రం నాకు సిక్స్‌ ప్యాక్‌ సెట్‌ కాదు. నేను కొన్ని పాత్రలు చేస్తే ఆడియన్స్‌ ఇష్టపడరు. అందులో ఒకటి చొక్కా విప్పి చూపించడం. ఇది నాకు అస్సలు నప్పదు అని సరదాగా బాలకృష్ణ అన్నారు. మరి యంగ్‌ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్న సిక్స్‌ ప్యాక్‌ ప్రదర్శించాల్సి వస్తేనో? నందమూరి వారసులు ఎన్టీయార్‌, కళ్యాణ్‌రామ్‌ కూడా సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేసేశారు. ఈ ట్రెండ్‌లో మరి మోక్షజ్ఞ ఏం చేస్తాడో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS