ఈ వారం ఎవరి వికెట్ పడబోతోంది.? మోనాల్ గజ్జర్ ఏడ్చింది కదా, అరియానా గ్లోరీ వికెట్ పడిపోవచ్చు.! ఇదీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోన్న ఓ ఆసక్తికరమైన చర్చ. బిగ్‌బాస్‌కి సంబంధించి మోనాల్‌ని ఎవరు గట్టిగా వ్యతిరేకిస్తే, వాళ్ళ వికెట్ పడిపోతోందా.? అంటే, మరీ అన్ని సందర్భాల్లో కాకపోయినా, కొన్ని సందర్భాల్లో ఇది వర్కవుట్ అయ్యింది.
మోనాల్‌ని విన్నర్‌ని చేసే క్రమంలో ఆమె చుట్టూ నెగెటివిటీని తగ్గిస్తున్నారన్న ప్రచారం చాలాకాలంగా సోషల్ మీడియాలో జరుగుతోంది. దానికి కొనసాగింపుగా, ఇప్పుడు అరియానా పేరు తెరపైకొచ్చింది. గత వారం అవినాష్ ఎలిమినేట్ అవడానికి కూడా మోనల్ గజ్జర్ కారణమని అంటున్నారు కొందరు. అందులోనూ కొంత నిజం లేకపోలేదు. మోనాల్, అవినాష్‌ని కాలితో తన్నడం, దానిపై అవినాష్ అసహనం వ్యక్తం చేయడం, ఈ విషయమై రాద్ధాంతం జరిగి, మోనల్ ఏడ్చేసి, చివరికి అవినాష్‌కి క్షమాపణ చెప్పడం జరిగాయి.
అయితే, మోనల్ పట్ల నెగెటివిటీ మాత్రం పెరిగింది. మోనల్‌పై నెగెటివిటీని తట్టుకోలేక అవినాష్‌ని పంపించేశారా.? అన్నది అవినాష్ అభిమానుల ఆవేదన. దీంట్లో నిజమెంతోగానీ, అరియానా నిన్నటి ఎపిసోడ్‌లో మోనల్‌తో గట్టిగానే గొడవ పడింది. ఈ రోజు అరియానా, సోహెల్‌తో గొడవ పడుతోంది. దాంతో, ఆమెను హౌస్ నుంచి బయటకు పంపేయడం ఖాయమని అంటున్నారు. ఇదెంత నిజమోగానీ, అరియానా అయితే బిగ్ హౌస్‌లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.