అల్లరి నరేష్ హీరోయిన్ కి చేదు అనుభవం

మరిన్ని వార్తలు

అల్లరి నరేష్ పక్కన హీరోయిన్ గా నటించిన మోనాల్ గజ్జర్ కి ఒక చేదు అనుభవం ఎదురైంది. 

ఆ వివరాల్లోకి వెళితే- మోనాల్ గజ్జర్ అహ్మదాబాద్ లోని తన కుటుంబసభ్యులకి చెందిన బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం జరిగింది, ఆ సమయంలో ఆ పార్లర్ కి దగ్గరిలోనే తన కారుని పార్క్ చేసింది. ఇక అక్కడి నుండి వచ్చేసే ప్రయత్నంలో భాగంగా పార్క్ చేసిన కారు దగ్గరికి రాగానే ఒక గుర్తు తెలియని వ్యక్తి తన కారు పైన మూత్రవిసర్జన చేయడం చూసింది. 

ఎందుకలా చేస్తున్నావు అని ఆమె అడగగా ఆమె పైకి ఎదురుతిరగడం దుర్బాశలాడడం చేశాడు. ఈ మొత్తాన్ని ఆమె తన సెల్ ఫోన్ లో చిత్రీకరించింది ఆ వీడియో ని పోలీసులకి అందచేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తి అన్నది ఎవరని గుర్తించి అతని పైన కేసు నమోదు చేశారు. 

ఇక ఈ విషయాన్ని మొత్తం ఆమె సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS