అఖిల్ - పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. దసరా సందర్భంగా చిత్ర బృదం విడుదల చేసింది. ‘మీ మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఆశిసున్నారు` అనే అఖిల్ డైలాగ్ తో టీజర్ మొదలైంది. పెళ్లిపై ఈతరం అభిప్రాయాలేంటి? అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కించినట్టు టీజర్ లో స్పష్టం అవుతోంది. పెళ్లిపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలున్న ఓ అబ్బాయి, అమ్మాయి కలిస్తే ఎలా ఉంటుంన్న ఆలోచనే.. ఈ సినిమా. `నాకు కాబోయేవాడు నా షూతో సమానం’ అనే పూజా హెగ్డే డైలాగ్ తో ఆమె పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవొచ్చు. టీజర్ కాస్త రొమాంటిక్ గానే డిజైన్ చేశారు. ఈ సీజన్‌లో రాబోతున్న ఓ మంచి రొమాంటిక్, కామెడీ ఎంటర్ టైనర్ అనే భరోసా టీజర్ కలిగించింది.
అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో బన్నీ వాసు, వాసూవర్మ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీని నిర్మిస్తున్నారు. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. ఆయన అందించిన బీజియమ్స్ కూడా ఈ టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.