నడుము కూడా బుసకొడుతుందా? అలా బుస కొడితే, కుర్రాళ్ళ గుండె స్వీట్ పెయిన్‌కి గురవుతుందా? అయి తీరాల్సిందే. ఎందుకంటే, అక్కడ ఆ నడుము కొట్టే 'బుస' తీవ్రత అంతలా వుంది మరి. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టీవీ సీరియల్ నాగిని ద్వారా పాపులర్ అయిన మౌనీ రాయ్, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. 'కేజీఎఫ్' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసి, సౌత్ ప్రేక్షకులకూ దగ్గరయ్యింది.
అయితే, రెమ్యునరేషన్ విషయంలో అమ్మడు మరీ ఓవర్ చేస్తుండడంతో ఆమె అందం అడవి కాచిన వెన్నెలవుతోందట. లేకపోతే, వరుస అవకాశాలతో సౌత్ సినిమానీ, బాలీవుడ్‌నీ ఓ రేంజ్‌లో ఊపేసేంతటి టాలెంట్ మౌనీ రాయ్‌లో వుంది మరి. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే, రెమ్యునరేషన్ విషయంలో పట్టింపులేవీ తనకు లేవని అంటోంది. అవునా? మరి అలాగైతే, రెమ్యునరేషన్ కారణంగానే ఈమెకు అవకాశాలు రావడంలేదనే గాసిప్స్ ఎలా పుడుతున్నాయట.?