సినీ ప్రియులకు శుభవార్త. మెల్లమెల్లగా ఇప్పుడు తెలుగు రాష్ఠ్రాలలో థియేటర్లు తెరచుకుంటున్నాయ్. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడానికి యాజమాన్యాలు సిద్ధంగానేఉన్నాయి. థియేటర్లు ఖాళీగా ఉండడం కంటే, ఏదో ఓ సినిమా ఆడుతుంటేనే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చాయి. విశాఖపట్నంలో శని, ఆది వారాలు కొన్ని థియేటర్లు తెరచుకున్నాయి. జగదాంబ థియేటర్‌లో `క్రాక్` సినిమాని ప్రదర్శించారు. దానికి స్పందన బాగానే ఉంది.
థియేటర్లో సినిమా చూడాలన్న ఉత్సాహం ప్రేక్షకులకు ఉందా, లేదా? అనేది తెలుసుకోవడానికి ఈ ప్రదర్శనలు ఉపయోగపడతున్నాయి. తెలంగాణలో కూడా థియేటర్లు తెరచుకునే ఛాన్స్ ఉంది. వకీల్ సాబ్, క్రాక్, జాతిరత్నాలు... ఇలాంట సినిమాల్ని రీ - రిలీజ్ చేసి, ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలని ఎగ్జిబీటర్లు భావిస్తున్నారు. జులై చివరి నాటికి 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చే ఛాన్సుంది. అదొచ్చేస్తే.. ఎలాగూ పెద్ద సినిమాలు వరుస కడతాయి. ఈలోగా చిన్న సినిమాలు జోరుగా తెరపైకొచ్చే అవకాశం ఉంది.