ఆ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్‌..

మరిన్ని వార్తలు

ఏప్రిల్‌ 14 తర్వాత దేశంలో లాక్‌ డౌన్‌ ఎత్తివేస్తారా.? అమెరికాలో పరిస్థితులు సద్దుమణుగుతాయా.? ఈ అంశాలపై తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో సినిమా ది¸యేటర్లు మూతపడ్డాయి. సినిమా షూటింగులు కూడా ఆగిపోయాయి. ఇప్పటికిప్పుడు కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగిపోయే పరిస్థితి లేదు. దాంతో, ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా.? లేదా.? అన్నదానిపై బిన్నాభిప్రాయాలున్నాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేసినా, సినిమా ది¸యేటర్లు ఇప్పట్లో తెరవడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. అయితే, సినిమా షూటింగులకు ఇబ్బంది వుండకపోవచ్చనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది.

 

సినిమా రిలీజ్‌లు లేకపోతే, సినిమాలు షూట్‌ చేసుకుని ఏం లాభం.? అని ఇంకొందరు అంటున్నారు. సినిమా లెక్కలు మారిపోయాయి. ఓవర్సీస్‌ మార్కెట్‌ ఇప్పుడు పెద్ద సినిమాలకు చాలా అవసరం. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా మారితేనే.. మళ్ళీ సినిమా సందడి నెలకొంటుంది. అప్పటిదాకా సమస్యలు తప్పవు. సినిమా రంగం ఆలోచనలు ఇలా వుంటే, బుల్లితెరకి మాత్రం పెద్దగా ఇబ్బందులు వుండకపోవచ్చు ముందు ముందు అని ఆ రంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా, ఏప్రిల్‌ 14 తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ, సినీ పరిశ్రమ, టీవీ పరిశ్రమ మాత్రమే కాదు, డిజిటల్‌ ప్లాట్‌ఫావ్స్‌ు కూడా ‘లాక్‌ డౌన్‌’ ఎత్తివేత కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS