జయాపజయాల గురించి అలోచించకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన 'ఆహా నా పెళ్ళంట' సిరిస్ ఓకే అనిపించింది. ఇదే జోరులో మరో సినిమాకి పచ్చ జెండా ఊపాడు రాజ్ తరుణ్. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి విజయాలు అందించి ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రానికి తిరగబడరా సామి’ అనే టైటిల్ ని పెట్టారు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. దర్శకుడు రవికుమార్ ఈ సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథని రెడీ చేశారు. ఆయన కూడా సినిమా చేసి చాలా కాలమైయింది. ఈ సినిమా ఇటు రాజ్ తరుణ్ కి అటు రవి కుమార్.. ఇద్దరికీ కీలకం కానుంది. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతారు.