మాస్‌ మహరాజ్‌ 'వెల్‌కమ్‌' చెబుతున్నాడు

మరిన్ని వార్తలు

గతేడాది అంతా రవితేజ ప్లేస్‌ ఖాళీగా ఉండిపోయింది. ఆయన నుండి ఒక్క సినిమా కూడా రాలేదు 2016లో. అయితే 2017 ఎంటర్‌ కాగానే రవితేజ ఈజ్‌ బ్యాక్‌ అయ్యాడు. వరస పెట్టి ఆయన సినిమాల ఇన్‌ఫర్మేషన్‌ బయటికి వస్తోంది. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రవితేజ నటిస్తోన్న కొత్త చిత్రం 'రాజా ది గ్రేట్‌' సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు. 'పటాస్‌', సుప్రీమ్‌' సినిమాలతో మంచి ఎంటర్‌టైనింగ్‌ హిట్స్‌ అందుకున్న డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. ఈ సినిమాతో ఏదో మ్యాజిక్‌ చేయబోతున్నాడనిపిస్తోంది. టైటిల్‌ లోగోనే ఎంతో కొత్తగా డిజైన్‌ చేయించాడు. 'వెల్‌కమ్‌ టు మై వరల్డ్‌' అంటూ కొత్త లుక్‌లో కనిపిస్తోంది ఈ టైటిల్‌ లోగో. అలాగే టైటిల్‌ కూడా 'రాజా ది గ్రేట్‌' అంటూ తెలుగు, ఇంగ్లీష్‌ మిక్కింగ్‌లో ఉండేట్లుగా సరికొత్త డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. దిల్‌ రాజు సమర్సణలో శిరీష్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదికెళ్లనుంది. ఇవే గాక రవితేజ 'టచ్‌ చేసి చూడు' అంటూ పవర్‌ఫుల్‌ టైటిల్‌తో మరో సినిమాకి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్‌ జరుపుకోనున్నాయట. అంటే ఈ ఏడాది రవితేజ నుండి రెండు సినిమాలు ఇప్పటికే కన్‌ఫామ్‌ అయిపోయాయి. అలాగే ఈ లోగా ఇంకెన్ని సినిమాలు రవితేజ ఓకే చేస్తాడో చూడాలిక. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS