యూట్యూబ్ లో దుమ్ములేపిన అఖిల్ సినిమా

By Inkmantra - August 06, 2020 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

ఈమధ్య తెలుగు సినిమాలను హిందీ ప్రేక్షకులు భారీగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మన డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ నమోదు చేస్తున్నాయి. తాజాగా అదే కోవలో అఖిల్ అక్కినేని నటించిన 'Mr.మజ్ను' చిత్రం భారీ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.

 

'Mr.మజ్ను' సినిమాకు యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదు కావడం ఒక విశేషం. ఒక సూపర్ హిట్ సినిమాకు ఇలా వ్యూస్ నమోదైతే అది సాధారణమేమో కానీ తెలుగులో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన ఈ చిత్రం హిందీ లో 100 మిలియన్ల వ్యూస్ సాధించడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఏదేమైనా ఈ 100 మిలియన్ వ్యూస్ 'Mr.మజ్ను' టీమ్ కు రిలీఫ్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'Mr.మజ్ను' చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

 

ఇక అఖిల్ కొత్త సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకుడు. వేసవిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కారణంగా వాయిదా పడింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS