సలార్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్ నెక్స్ట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. కల్కి త్వరలో రిలీజ్ కానుండగా, మారుతితో ఒక మూవీ చేస్తున్నాడు. నెక్స్ట్ హను రాఘవపూడితో ఒక మూవీ కమిట్ అయ్యాడు. ఇంకో వైపు సలార్ పార్ట్ 2 , సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా కమిట్ అయ్యాడు. ప్రభాస్ కి వరల్డ్ వైడ్ ఉన్న క్రేజ్ కారణంగా పలువురు స్టార్ హీరోయిన్స్ డార్లింగ్ తో కలిసి నటించాలని ఆసక్తిగా ఉన్నారు. ప్రభాస్ మూవీ అంటే, హీరోయిన్ ఎవరన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలోనే హను రాఘవ పూడి తెరకెక్కించే మూవీలో హీరోయిన్స్ ఎవరన్న చర్చ మొదలయ్యింది. ఈ చర్చకి తెరదించుతూ ఈ మూవీ హీరోయిన్స్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో మెయిన్ లీడ్ రోల్ కోసం మృణాల్ ఠాకూర్ ను తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. శ్రీలీలను సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. సెకండ్ హీరోయిన్ అయినా ఆ పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. హను రాఘవ పూడి డైరక్ట్ చేసిన 'సీతారామం' మూవీలో మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేసింది. నటన పరంగా మంచి మార్కులే సంపాదించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో వచ్చిన క్లాసిక్ హిట్ గా నిల్చింది ఈ మూవీ. మృణాల్ అప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. కానీ సరైన గుర్తింపు రాలేదు. సీతారామం తరవాత సౌత్ లో మృణాల్ కి పేరుతో పాటు, అవకాశాలు కూడా వచ్చాయి.
హాయ్ నాన్న తో ఇంకో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుని, నెక్స్ట్ రౌడీ హీరోతో ఫామిలీ స్టార్ మూవీలో చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. డార్లింగ్ తో సినిమా చేస్తుంది కాబట్టి ఈ సినిమాతో తను స్టార్ హీరోయిన్ గా మారటం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇన్నాళ్ళకి మృణాల్ కి కాలం కలిసి వచ్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.