నార్త్ లో మృణాల్ ఎంత కష్టపడినా, ఎన్నాళ్ళు కాలు అరిగేలా తిరిగినా రాని అవకాశాలు...ఫేమ్, సౌత్ లో ఒక్క సినిమాతో దక్కింది. సీతారామం సినిమాతో మృణాల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నెక్స్ట్ మూవీ హాయ్ నాన్న బ్లాక్ బ్లస్టర్ హిట్ తో సౌత్ లో తన హవా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. విజయ్ దేవర కొండతో త్వరలో 'ఫ్యామిలీ స్టార్' మూవీతో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇది కాక ప్రభాస్, హను రాఘవపూడి ప్రాజెక్ట్ లో మృణాల్ ఫిక్స్ అయ్యిందని టాక్. ఇక ఈ సినిమాతో అమ్మడి కెరియర్ మారిపోయినట్లే, పాన్ ఇండియా హీరోయిన్ అయిపోవటం ఖాయం అన్నారు సినీ విశ్లేషకులు. తధాస్తు దేవతలు విన్నారేమో ఆ మాటని ప్రభాస్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకముందే కోలివుడ్ లో సూపర్ స్టార్స్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.
ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలకి ఓకే చెప్పిందని తెలుస్తోంది. స్టార్ హీరోలు అజిత్, శింబు, శివ కార్తికేయన్ లతో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు అందుకుందని సమాచారం. మార్క్ ఆంటోనీ ఫేమ్ అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ చేస్తున్న సినిమాలో మృణాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ చేసే శివ కార్తికేయన్ సినిమాలో కూడా మృణాల్ ఫైనలయ్యిందట.
కమల్ హాసన్ నిర్మాతగా, శింబు హీరోగా చేస్తున్న సినిమాలో మృణాల్ ఫిక్స్ అయ్యింది. ఇలా వరుస సినిమాలతో తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయి, ఫుల్ ఖుషీగా ఉంది. ఇన్నాళ్ళకి మృణాల్ కష్టాలు ఫలించాయి, మంచి రోజులొచ్చాయి అని తన శ్రేయోభిలాషులు కూడా సంతోష పడుతున్నారు. రానున్న కాలంలో సౌత్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి మృణాల్ చేరుతుందేమో చూడాలి.