మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ కోసం మెగా ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటిస్తోంది. మానుషీకి ఇదే తోలి తెలుగు సినిమా. ఈ యాక్షన్ మూవీని సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ పెళ్లి తరువాత వస్తున్న మొదటి సినిమా ఇదే. లావణ్య తన లైఫ్లోకి వచ్చిన తరవాత లక్ కలిసి వస్తుందా లేదా అని ఫాన్స్, ఫామిలీ మెంబెర్స్ ఆత్రంగా ఉన్నారు. రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ మూవీకి సంబంధించిన ఫైనల్ స్ట్రైక్ అప్ డేట్ ని సోమవారం అందించనున్నట్లు మేకర్స్ అఫీషయల్ గా అనౌన్స్ చేసారు. నవదీప్, రుహాణి శర్మ, మీర్ సర్వార్ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ మార్చి 1న గ్రాండ్ గా తెలుగు, హిందీ భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ లో కూడా బాగా ప్రమోట్ చేస్తోంది టీమ్. వరుణ్ తేజ్ కి ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ మూవీ ద్వారా వరుణ్ పాన్ ఇండియా హీరోగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.