కల్కిలో మృణాల్ పాత్ర ఇదేనా?

మరిన్ని వార్తలు

మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టి తరవాత తెలుగులో కూడా అవకాశాలు అందుకుంది. సీతారామం మూవీతో అన్ని భాషలవారికి దగ్గరయింది. ఈ క్రేజ్ తో తెలుగు , తమిళం సినిమాల్లో బిజీగా మారింది. తెలుగులో మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ కొడుతోంది అనుకున్న ఫ్యామిలీ స్టార్ మూవీ పరవాలేదనిపించుకుంది. నెక్స్ట్ మృణాల్ ఏ సినిమాతో వస్తుందా అని ఎదురురుచూస్తున్నారు ఆమె ఫాన్స్. ఈ టైంలో ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మృణాల్ కల్కి లో క్యామియో రోల్ చేస్తోంది అని ప్రచారం జరుగుతోంది. కల్కిలో చాలా మంది తారలు ఉన్నారు. అందర్నీ ముందే రివీల్ చేయలేదు డైరక్టర్. మాళవిక నాయర్ కూడా ఉన్నట్లు సెకండ్ ట్రైలర్ లోనే తెలిసిందే. అలాగే మృణాల్ కూడా ఉన్నట్లు సమాచారం. 


అయితే ఇప్పుడు కల్కిలో మృణాల్ పాత్ర ఇదే నంటూ నెట్టింట్లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి సినిమాలో మృణాల్ తల్లి పాత్రలో కనిపించనుంది అని టాక్.  అదీ ప్రభాస్ తల్లిగా. అంటే  భైరవ చిన్ననాటి రోల్ కు మృణాల్ తల్లిగా నటించిందని తెలుస్తోంది. మృణాల్ ఇప్పటివరకు సీనియర్ హీరోలతో కూడా నటించలేదు. యంగ్ హీరోలతోనే నటిస్తూ వస్తోంది. ఇప్పుడు మాత్రం ప్రభాస్ కి తల్లిగా చేస్తోంది. మృణాల్ డేరింగ్ స్టెప్ వేసిందని సినీవిశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.  క్యామియో రోల్ అయినా మృణాల్ పాత్ర స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ఉంటుందని సమాచారం. 

   
కల్కి, రాజా సాబ్ ల తరవాత ప్రభాస్, హను రాఘవపూడితో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఆ మూవీలో ప్రభాస్ కి జోడిగా మృణాల్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. హను రాఘవపూడి తీసిన 'సీతారామం' మూవీలో మృణాల్ యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ మృణాల్ ని తీసుకుందామని హను ఫిక్స్ అయినట్టు సమాచారం. ప్రభాస్ కి  హీరోయిన్ గా నటించాల్సిన మృణాల్ ఇప్పుడు కల్కిలో తల్లి పాత్ర చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS