బుక్ మై షో లో కల్కి గందరగోళం

మరిన్ని వార్తలు

కల్కి మూవీ జూన్ 27 న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కల్కి సినిమా చర్చలే నడుస్తున్నాయి. ప్రస్తుతం  ప్రపంచాన్ని కల్కి నడిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో 'KALKI 2898 AD' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. టైం పీరియడ్ జోనర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కటం, స్టార్ క్యాస్టింగ్ ఉండటం, సలార్ తరవాత డార్లింగ్ నుంచి వస్తున్న మూవీ కావటంతో కల్కి కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమ్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి బిజీగా ఉంది. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే  టికెట్స్ కోసం బుక్ మై షో యాప్ ఓపెన్ చేసిన  కొందరికి ఊహించని పరిణామం ఎదురయ్యింది.


బుక్ మై షోలో కల్కి  టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్న ఆడియన్స్ కి ప్రభాస్ సినిమా బదులు రాజశేఖర్ నటించిన కల్కి సినిమా టికెట్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది. దీనితో అయోమయానికి గురిఅవుతున్నారు ఫాన్స్. 'కల్కి' టైటిల్ తో రాజశేఖర్ ఐదేళ్ల కిందట ఓ సినిమా చేసాడు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు  బుక్ మై షోలో 'కల్కి' అని సెర్చ్ చేస్తే, రాజశేఖర్ సినిమా కూడా వస్తోంది. అయితే టికెట్లు అయిపోతాయేమో అనే ఆతృతలో కొందరు పొరపాటున 'కల్కి 2898 AD' చిత్రానికి బదులుగా ప్రశాంత్ వర్మ 'కల్కి' మూవీకి టికెట్లు బుక్ చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  కూకట్‌ పల్లి భ్రమరాంబ థియేటర్ లో పొరపాటున ప్రభాస్ కల్కికి బదులుగా, రాజశేఖర్ కల్కి సినిమాకి టికెట్స్ బుక్ అయ్యి , 6 షోలు హౌస్‌ ఫుల్‌ అయ్యాయని ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. దీనిపై  హీరో రాజశేఖర్ సైతం సరదాగా స్పదించారు. ఈ విషయంతో తనకేం సంబంధం లేదని చెప్తూ టీమ్ కి విషెస్ చెప్పారు. 


బుక్ మై షోలో కల్కి అని సెర్చ్ చేస్తే 'టొవినో థామస్ నటించిన మలయాళ 'కల్కి' చిత్రం కూడా వస్తోంది. అసలు ఇది ఎలా జరుగుతుందో తెలియటం లేదని వాపోతున్నారు.  ఎందుకంటే  సినిమా రన్ అవుతుంటే మాత్రమే టికెట్స్ బుక్ చేసుకునే ఆప్షన్ వస్తుంది, ప్రస్తుతం ప్రభాస్ కల్కి ఒక్కదానికే ఈ అవకాశం ఉన్నా మిగతావాటికి కూడ ఏందుకు టికెట్స్ బుక్ అవుతున్నాయని సందేహాలు వెలువడుతున్నాయి. యాప్ లో ఏదో టెక్నికల్ గ్లించ్ వల్ల ఇలా జరుగుతోందని  ఈ  క్రమంలోనే  'కల్కి 2898 AD' ప్లేస్ లో రాజశేఖర్ 'కల్కి' ఇమేజ్ చూపిస్తోందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS