చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రావడం కొత్తకాదు. గతంలో చాలా సార్లు జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సంక్రాంతి బరిలోనే దిగాయి. అయితే ఇక్కడ విషయం వేరు. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాలకు నిర్మాత ఒకరే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ రెండు సినిమాలని నిర్మిస్తోంది.
రెండు పెద్ద సినిమాలని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం మామూలు విషయం కాదు. ప్రమోషన్స్ చూసుకోవాలి. బోలెడు క్లియరెనన్సులు వుంటాయి. వాళ్ళకంటూ పంపిణీదారులు వుంటారు. రెండు పెద్ద సినిమాలని ఒకేసారి తీసుకోవడం ఒక సవాల్. ఒక నిర్మాణ సంస్థ రెండు పెద్ద సినిమాలు చేస్తున్నపుడు ఒకటి తేడాకొట్టిన మరో సినిమా వచ్చినపుడు 'లెక్కలు' చూసుకుందామనే ఆప్షన్ వుంటుంది. అయితే రెండు సినిమాలు ఒకేసారి రావడంతో ఈ ఆప్షన్ వుండదు. ఏ రకంగా చూసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ఇది ప్రతికూలమే. మరి నిర్మాతల మంచి గురించి అలోచించైనా హీరోలు విడుదల విషయంలో మరో ఆలోచన చేస్తారేమో చూడాలి.