'మే' డే 'ముద్ర' వేయబోతున్న 'అర్జున్‌ సురవరం'.!

By iQlikMovies - March 23, 2019 - 16:13 PM IST

మరిన్ని వార్తలు

మే 1 అంటే కార్మికుల దినోత్సవం. ఈ కార్మికుల దినోత్సవం రోజే యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్ద్‌ నటించిన 'అర్జున్‌ సురవరం' ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్‌గా ఈ డేట్‌ అనౌన్స్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఎప్పుడో ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ టెక్నికల్‌ కారణాలతో రిలీజ్‌ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ నెల 29న వస్తుందని భావించారంతా.

 

కానీ మరో రెండు రోజులు పోస్ట్‌ పోన్‌ అయ్యి సరిగ్గా సినిమాకి యాప్ట్‌ డేని ఫిక్స్‌ చేసుకుంది. ఈ సినిమాలో హీరో పేరు అర్జున్‌ లెనిన్‌ సురవరం. పవర్‌ఫుల్‌ జర్నలిస్టు పాత్ర అది. అయితే 'లెనిన్‌' అనే పేరు లెఫ్ట్‌ పార్టీలు పెట్టుకుంటాయి. మేడే అనేది కార్మికుల దినోత్సవం. ఈ పేరుకీ, ఆ రోజుకీ అవినాభావ సంబంధాలున్నాయి. సో ఆ పాయింట్‌ నిఖిల్‌కి బాగా కలిసొచ్చే అంశం. అసలే ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు నిఖిల్‌. అలాగే అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ చూస్తే ఈ సినిమాతో నిఖిల్‌ హిట్‌ కొట్టడం ఖాయమే అని సినీ అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు కూడా. అయితే ప్రచార చిత్రాల్ని నమ్మి ఫైనల్‌ డెసిషన్‌ చెప్పేయలేం. కాబట్టి విడుదల రోజు వరకూ ఆగాల్సిందే.

 

విడుదలైతేనే కదా అసలు సినిమా తెలిసేది. టి.ఎన్‌. సంతోష్‌ ఈ సినిమాకి దర్శకుడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS