నటీనటులు - వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్, విశ్వక్ సేన్ తదితరులు
కథ స్క్రీన్ ప్లే: మాటలు: సందీప్ రాజ్
దర్శకత్వం: గంగాధర్
నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల
సంగీతం: కాల భైరవ
ఎడిటింగ్: పవన్ కళ్యాణ్
రేటింగ్ : 2.25/5
ఈ వారం ఏకంగా 17 సినిమాలు విడుదలైయ్యాయి. అయితే ఇందులో బజ్ వున్నవి కొన్నే. అందులో 'ముఖచిత్రం' కూడా వుంది. హీరో విశ్వక్ సేన్ లాయర్ గా అతిధి పాత్రలో కనిపించాడు. సినిమా బండి చిత్రంతో ఆకట్టుకున్నాడు వికాస్ వశిష్ట ప్రధాన పాత్ర పోషించాడు. కలర్ ఫోటో సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న సందీప్ రాజ్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం మరో విశేషం. ట్రైలర్ తో క్యురియాసిటీని పెంచిన ముఖచిత్రం ఎలాంటి అనుభవాన్ని ఇచ్చిందో చూద్దాం.
కథ:
డాక్టర్ రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట) ఫేమస్ ప్లాసిక్ట్ సర్జన్. మహతి (ప్రియా వడ్లమాని) సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. పెళ్ళిళ్ళ బ్రోకర్ నుండి మహతి ఫోటో రాజ్ కుమార్ కి వస్తుంది. మహతి చూసిన రాజ్ కుమార్.. ఆమెనే పెళ్ళాడాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లి చూపులకు విజయవాడ వస్తాడు. మహతికి కూడా రాజ్ కుమార్ నచ్చేస్తాడు. పెద్దల సమక్షంలో వివాహం జరుగుతుంది.. ఇదీలావుండగా ఒకరోజు రాజ్ కుమార్ స్నేహితురాలు మాయా (అయేషా ఖాన్ ) యాక్సిడెంట్ కి గురౌతుంది. తన మొహం అంతా తీవ్రంగా గాయపడుతుంది. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోజే మహతి మెట్లపై కాలుజారి కింద పడి చనిపోతుంది. మహతి మొహాన్ని మయాకి ట్రాన్స్ ప్లాంట్ చేస్తాడు రాజ్ కుమార్. దిని తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి ? అసలు మహతి అంత సడన్ గా ఎలా చనిపోయింది ? అది సహజ మరణమా ? హత్యా ? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
పాయింట్ ఏదైనా దాన్ని రక్తికట్టించేలా చెప్పడమే సినిమా విజయ రహస్యం. ముఖచిత్రం పాయింట్ బావుంది. అయితే దాన్ని యంగేజింగా చెప్పడంలోనే ఇబ్బంది ఎదురైయింది. ఒక సామాజిక సమస్యని థ్రిల్లింగా కోర్ట్ డ్రామాగా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. పాత్రల పరిచయం, పెళ్లి చూపులు, పెళ్లి ఇవన్నీ కాస్త సాగాదీతగా అనిపిస్తాయి. వీటిని షార్ప్ గా చేసి అసలు పాయింట్ లోకి త్వరగా వెళ్లుంటే బావుండేది. మాయా యాక్సిడెంట్. మహతి చావు తర్వాత కథలో మలుపు వస్తుంది. అయితే పెద్ద ఆసక్తిని కలిగించకుండానే ఇంటర్వెల్ బాంగ్ వేశాడు దర్శకుడు.
సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలౌతుంది. మహతి చావుకి కారణం తెలసిన తర్వాత కథలో సంఘర్షణ మొదలుతుంది. అయితే తర్వాత కోర్ట్ డ్రామాని డిజైన్ చేశారు. దిన్ని బలంగా రాసుకొని వుంటే బావుండేది. సిసి కెమరాలో రికార్డ్ చేసి అవి అధరాలు గా చూపడం, లాయర్ల వాదనలు రొటీన్ గానే వుంటాయి. అయితే విశ్వక్ సేన్ స్క్రీన్ ప్రజన్స్ తో కోర్ట్ డ్రామా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ముగింపు కూడా ఊహించినట్లే రొటీన్ గా వుంటుంది.
నటీనటులు:
వికాస్ వశిష్ట మరోసారి ఆకట్టుకున్నాడు. రాజ్ కుమార్ పాత్రని సహజంగా చేశాడు. మహతి పాత్రలో ప్రియావడ్లమాని అందంగా వుంది. తన అభినయం కూడా ఆకట్టుకుంది మయా ఫెర్నాండెజ్ గా చేసిన అయేషా ఖాన్ కి కూడా మంచి మార్కులు పడతాయి. విశ్వక్ చేసింది చిన్న పాత్రే అయినా కథకు బలాన్ని ఇచ్చే పాత్ర. లాగర్ గా విశ్వక్ నటన ఆకట్టుకుంది. లాయర్ వశిష్ట గా చేసిన రవిశంకర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. మీర్ , చైనత్య, సునీల్ మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
టెక్నికల్ గా :
నిర్మాణ పరంగా బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. విశ్వక్ బోనులో నిలబడి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటాయ. సామాజిక సమస్యని ఒక థ్రిల్లర్ నేపధ్యంలో చెప్పే కథ ఇది. అయితే ఒక మిస్టరీ చావుని కోర్ట్ రూమ్ డ్రామాకి కనెక్ట్ చేసి సామజిక సమస్యని చర్చించడం... ముఖచిత్రంలో అతకలేదు.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
కథా నేపధ్యం
ట్విస్ట్
మైనస్ పాయింట్స్
నిదానంగా సాగే కథనం
డ్రామా రక్తికట్టకపోవడం
రొటీన్ ముగింపు
ఫైనల్ వర్దిక్ట్ : దారి తప్పిన'చిత్రం'