'NBK108'...... క్లాప్ పడింది

మరిన్ని వార్తలు

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాకి క్లాప్ పడింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్‌ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్‌కి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

 

#NBK108 షూటింగ్ కూడా ఈ రోజు నుండే యాక్షన్ బ్లాక్ తో ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ బ్లాక్ కి వి వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో ఫైట్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ నిర్మించారు. బాలకృష్ణ మునుపెన్నడూ పోషించిన పాత్రలో ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్ అండ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ వుండబోతున్నాయి. బాలకృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఓ పవర్‌ఫుల్ కథను రాశారు. ఎస్ థమన్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS