బిగ్ బాస్ తెలుగు మొట్టమొదటి సీజన్ 5వ వారానికి చేరుకున్న ఈ తరుణంలో ప్రతి ఎపిసోడ్ కి ఒక కొత్త ట్విస్ట్ తో వీక్షకుల్లో టెన్షన్ పెంచుతున్నది. ప్రతి వారం కచ్చితంగా ఒక హౌస్ మేట్ నిష్క్రమణ ఉంటుంది అని చెప్పిన తరుణంలో ప్రతి ఆదివారం ఆడియన్స్ లో తీవ్ర హైప్ వస్తున్నది.
అయితే నిన్న జరిగిన నిష్క్రమణలో ఒక పెద్ద కమర్షియల్ చిత్రం తాలుకా ట్విస్ట్ ఉండడంతో అందరికి మతి పోయింది అనే చెప్పాలి. హౌస్ మేట్స్ కి ముమైత్ ఖాన్ నిష్క్రమిస్తుంది అని చెప్పి వారిదగ్గర నుండి వీడ్కోలు చెప్పించిన తరువాత ఒక్కసారిగా ఆమెని మళ్ళీ ఆటలో కొనసాగించే నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆమెని తిరిగి కొనసాగిస్తున్న తరుణంలో మళ్ళీ అందరిలాగా హౌస్ లో పెట్టకుండా ప్రత్యేకంగా ఆమెని ఒక గదిలో ఉంచి మిగతా వాళ్ళ ఆట తీరుని గమనించే విధంగా చేయడం నిజంగా హైలైట్ అని బిగ్ బాస్ రోజు చూస్తున్న ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ అనుకోని ట్విస్ట్ తో బిగ్ బాస్ మరింత హైప్ ని సంతరించుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.