ఇప్పటికే SIT విచారణకి హాజరయిన ముమైత్ ఖాన్ విచారణ ఎంతసేపు జరగనుందో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
ఎందుకంటే, నిన్నటి విచారణ కోసం నటి చార్మీ హై కోర్టుని సంప్రదించి విచారణ సమయాల్లో ప్రత్యేఖమైన వెసులుబాటు పొందింది.
అయితే అటువంటి వెసులుబాటు ఏమి పొందని ముమైత్ ఖాన్ ని మరి ఎంతసేపు విచారించనున్నారో తెలియడంలేదు. కాకపోతే విచారణ జరుగుతున్న సమయంలో మహిళా అధికారులు ఉంటున్నారు అన్న స్పష్టత అయితే ఉంది.
ఇక SIT అధికారులు మరి ముమైత్ నుండి ఎటువంటి సమాధానాలు రాబట్టనున్నారో అలాగే ఆమె నుండి ఏమైనా బ్లడ్, వెంట్రుకలు, గోళ్ళు శాంపిల్స్ తీసుకుంటారా లేదా అన్నది సాయంత్రానికి తెలిసే ఆస్కారం ఉంది.
ఈ విచారణ కోసం ముమైత్ తను పాల్గొంటున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నుండి బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే.