మురళీశర్మ ది గ్రేటెస్ట్‌!

మరిన్ని వార్తలు

'అ' సినిమా నుండి మరో కొత్త క్యారెక్టర్‌ పరిచయమైంది. ఇప్పటిదాకా ఈ సినిమా నుండి పరిచయమవుతున్న క్యారెక్టర్స్‌ అన్నీ దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. విభిన్నంగా పరిచయం చేస్తున్నారు. ఓ క్యారెక్టర్‌కీ, ఇంకో క్యారెక్టర్‌కీ అస్సలు పొంతనే లేదు. ఒకదానికి మించి మరోటి అన్నట్లుగా దేనికవే ప్రత్యేకం అనే స్థాయిలో డిజైన్‌ చేశారు. ఈ స్టిల్స్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన క్యారెక్టర్‌ స్టిల్స్‌ పరంగా సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో, ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో, ప్రశాంతి తిపిరనేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి తాజాగా వచ్చిన స్టిల్‌ ఏంటంటే, నటుడు మురళీ శర్మ క్యారెక్టర్‌ స్టిల్‌. ఈ స్టిల్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లేయింగ్‌ కార్డ్స్‌ ఎగురుతూ కనిపిస్తున్నాయి. 'ఐ యామ్‌ ది గ్రేటెస్ట్‌' అని డిజైన్‌ చేసుంది. 'అహంకారపూరితమైన రౌడీ' అనే అర్ధం వచ్చేటట్టుగా క్యాప్షన్‌ పెట్టి ఈ క్యారెక్టర్‌ని రిలీజ్‌ చేశారు. పాత్రకి తగ్గట్లుగానే హావభావాలు పలికిస్తున్నారు మురళీ శర్మ ఈ ఫోటోలో.

స్టిల్‌ని పరిచయం చేసిన విధానం బట్టి, క్రూరమైన విలన్‌ పాత్రలో మురళీ శర్మ నటిస్తున్నట్లు తెలుస్తోంది. నాని ఓ చేప క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. రెజీనా ఓ డిఫరెంట్‌ అండ్‌ షాకింగ్‌ క్యారెక్టర్‌ చేస్తోంది. ఇక నిత్యామీనన్‌, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్‌ ఇలా తదితర నటీనటులు స్పెషల్‌ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. కొత్త రకం కాన్సెప్ట్‌తో చాలా చాలా ప్రత్యేకతలతో తెరకెక్కుతోన్న 'అ' సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS