నాని హీరోగా వచ్చిన 'ఎంసీఏ', అఖిల్ హీరోగా వచ్చిన 'హలో' రెండు పోటా పోటీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఓవర్సీస్‌లో ఈ రెండు సినిమాలతోనూ మన హీరోలు మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతున్నారు. 'క్రిస్‌మస్' హాలీడేస్ ఈ రెండు సినిమాలకూ కలిసొచ్చాయి. సోమవారం వరకూ 8 లక్షల 15 వేల 674 డాలర్లు (5.23 కోట్లు) వసూలు చేసింది నాని 'ఎంసీఏ'. 7లక్షల 12 వేల 884 డాలర్లు (4.57 కోట్లు) కొల్లగొట్టింది అఖిల్ 'హలో'. మిలియన్ డాలర్స్ క్లబ్‌లోకి చేరడానికి ఈ ఇద్దరూ పోటీ పడుతున్నారు. వేగంగానే పరుగులు తీస్తున్నారు.
అఖిల్ 'హలో' కన్నా ఒక్కరోజు ముందు వచ్చాడు నాని 'ఎంసీఏ'తో. సో నానినే ముందుగా మిలియన్ డాలర్స్ క్లబ్‌లోకి చేరేలా ఉన్నాడు.అలా అని అఖిల్ ఏమాత్రం తగ్గడం లేదు. అంతే జోరు ప్రదర్శిస్తున్నాడు. టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబడుతున్నాయి ఈ రెండు సినిమాలు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని, సాయి పల్లవి జంటగా తెరకెక్కింది 'ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి'. భూమిక కీలక పాత్ర పోషించింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కి, నాని యాక్టింగ్, సాయి పల్లవి టాలెంట్ తోడయ్యింది. యూత్‌ని డిఫరెంట్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది.
ఎట్ ది సేమ్ టైమ్ నాని సినిమాలకు వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు ఎట్రాక్ట్ అవుతారు. ఇకపోతే అఖిల్ విషయానికి వస్తే, అఖిల్‌కిది రీ లాంఛింగ్ మూవీ. తన సోల్ మేట్‌ని వెతుక్కుంటూ వెళ్లే కుర్రోడి పాత్రలో అఖిల్ నటన ఆకట్టుకుంది. అలాగే కొత్తమ్మాయి కళ్యాణీ తన నటనతో తొలి సినిమాకే అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించింది. అఖిల్ యాక్షన్ సీక్వెన్స్‌స్‌కి అంతా ఫిదా అయిపోయారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్సీస్‌లోనూ ఈ రెండు సినిమాల జోరు ఇలా కొనసాగుతోంది.